బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 15 ఫిబ్రవరి 2023 (17:24 IST)

బాబు పుట్టాక కొత్త ప్రియుడితో ఎమీ జాక్సన్ చెట్టాపట్టాల్

Amy Jackson
Amy Jackson
భారత్‌లో వరసబెట్టి సినిమాలు చేస్తోన్న సమయంలో ఫారెన్ బ్యూటీ అమీ జాక్సన్ బ్రిటన్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, మోడల్, యాక్టర్ జార్జ్‌ పనాయొటోతో లవ్ ట్రాక్ నడిపింది. 
 
ఆ సమయంలోనే ఆమె గర్భం దాల్చింది. అప్పటి నుంచి అమీ సినిమాలకు బ్రేక్ ఇచ్చేసింది. జార్జ్‌ పనాయొటోతో లవ్‌లో ఉన్నప్పుడే ప్రెగ్నెంట్ అయిన అమీ జాక్సన్.. ఆ తర్వాత ఓ మగబిడ్డకు కూడా జన్మనిచ్చింది. బాబు పుట్టాక వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని అందరూ అనుకున్నారు. 
 
కానీ అమీ జాక్సన్ జార్జ్‌కు బైబై చెప్పేసిందని టాక్ వస్తోంది. తన ప్రియుడికి బ్రేకప్ ఇచ్చేసింది. బిడ్డతో కలిసి సమయం గడుపుతూ ఒంటరిగా వుంటున్న ఈ ముద్దుగుమ్మ..  ఎడ్ వెస్ట్‌విక్ అనే విదేశీ నటుడితో డేటింగ్ చేస్తున్నట్లు వచ్చిన వార్త నెట్టింట వైరల్ అవుతోంది. 
 
ఈ వార్తలను నిజం చేసేలా కొత్త బాయ్‌ఫ్రెండ్‌ ఎడ్ వెస్ట్‌విక్‌తో తీసుకున్న రొమాంటిక్ ఫొటోలను షేర్ చేసింది. ప్రేమికుల రోజును పురస్కరించుకుని అమీ జాక్సన్.. తన కొత్త బాయ్‌ఫ్రెండ్ ఎడ్ వెస్ట్‌విక్‌‌తో తీసుకున్న ఎన్నో అపురూపమైన హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.